హైదరాబాద్ : కర్నాటకలో హిజాబ్ వివాదం, కాషాయ కండువాల రగడపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కమల్ కామెంట్ చేశారు. కర్ణాటక ఇష్యూ పొరుగు రాష్ట్రాల వరకూ రాకూడదు. తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిదంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్‌పై వివాదం చెలరేగుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని హిం దూ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా రు. ఈ నేపథ్యం లో చినికి చినికి గాలివానగా మా రిన వివా దం చివరికి హింసాత్మక ఘటనలకు దా రి తీసింది. శివమొగ్గలోని బాపూజీ ప్రభుత్వ ప్రీయూనివర్సి టీ కళాశాల పరిసరాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు మం గళవారం లాఠీచార్జి చేశారు.
దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల సమీపంలోని పలు ప్రైవేటు బస్సులపై రాళ్లు రువ్వారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన కర్నాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘అల్లుర్లు, వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయడం, విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదు. ఇవన్నీ ఎంతగానో కలచి వేస్తున్నాయి. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలి’ అని కోరింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావు లేదంది. చట్టబద్ధంగా, రాజ్యాంగానికి అనుగుణంగా సమస్యను పరిష్కరిస్తామని వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.