Saturday, November 23, 2024

అమృత్‌సర్‌లో డ్రోన్ బాంబు దాడి… తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్ జవాన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ /అమృత్‌సర్ : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్‌ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. పంజాబ్ లోని అమృత్‌సర్ లో అజ్నాలా తెహసిల్ లోని పంజ్‌గ్రాహియన్ సరిహద్దు జౌట్‌పోస్ట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ రెండు ప్యాకెట్లలో పేలుడు పదార్ధాలను విడిచిపెట్టింది. సరిహద్దు భద్రతా దళం జవాన్లు వెంటనే అప్రమత్తమై ఆ డ్రోన్ పై కాల్పులు జరిపారు. ఆ డ్రోన్ పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. దీంతో బీఎస్‌ఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. రెండు ప్రదేశాల్లో పేలుడు పదార్ధాలను జవాన్లు గుర్తించారు. ఈ ప్యాకెట్లలో 4.7 కిలోల ఆర్‌డిఎక్స్, చైనా తయారీ పిస్టల్, రెండు మ్యాగజైన్లు 22 బులెట్లు, మూడు ఎలెక్ట్రానిక్ డిటొనేటర్లు, టైమర్ డివైస్, కార్ట్‌డెక్స్ వైర్, స్ప్లింటర్లు, సెల్స్, స్టీల్ కంటైనర్లు, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైపు, ప్యాకింగ్ మెటీరియల్, రూ. లక్షనగదు ఉన్నాయి. వాటిటి స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ బాంబుల తయారు చేయడానికి ఉపయోగించేవే అని అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో లూథియానా కోర్టు వద్ద జరిగిన పేలుడు, గత నెల ఢిల్లీ ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్ వద్ద జరిగిన పేలుడుకు ఉపయోగించిన పదార్ధాలు వంటివే ఇవని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News