హైదరాబాద్ : పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలను నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు ముఠాలకు చెందిన 16మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 410 క్వింటాళ్ల బియ్యం, ఐదు లారీలు, మహీంద్రాజీటో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎడిసిపి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. మొదటి ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు సంఘారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం, జోగిపేట గ్రామానికి చెందిన నెలకంటి మాణిక్యం రైస్ వ్యాపారం చేస్తున్నాడు. యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాకు చెందిన భానోత్ హుస్సేన్ పిడిఎస్ రైస్ వ్యాపారం చేస్తున్నాడు, ధీరావత్ దేవేందర్ డ్రైవర్, ధీరావత్ పవన్‌కళ్యాణ్ పిడిఎస్ వ్యాపారం చేస్తున్నాడు. రెండో ముఠాకు చెందిన సంఘారెడ్డి జిల్లా, ఆందోల్‌కు చెందిన జక్కపల్లి శంకర్ పిడిఎస్ వ్యాపారం చేస్తున్నాడు, నెలకంటి మహేష్ కుమార్ వ్యాపారం చేస్తున్నాడు.
మీర్‌పేటకు చెందిన లావుడ్య రాంజీ, ధీరావత్ రాజేష్, ధీరావత్ లక్ష్మణ్, మేఘావత్ భాను నాయక్, భూక్య రాజు, వధీర్ విజయ్‌కుమార్ భూపతిబాయి, మోరి భరత్ ధులబాయి. మూడో ముఠాలో సిద్దిపేట జిల్లా, వడ్డేపల్లికి చెందిన బాచు సంతోష్ కుమార్ అలియాస్ శివ రైస్ మిల్ వ్యాపారం చేస్తున్నాడు, బాచు రాములు, తోట ప్రవీణ్‌కుమార్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిందితులు రూ.9 నుంచి రూ.10లకు తుకారాం గేట్, మౌలాలి, పార్సిగుట్ట, చిలకలగూడ, ముషీరాబాద్, భువనగిరి, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్ తదితర ప్రాంతాల్లో పేదల నుంచి బియ్యం కోనుగోలు చేసి గుజరాత్‌కు చెందిన వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు. బియ్యం కొనుగోలు చేసిన తర్వాత జక్కనపల్లి శంకర్ అక్రమంగా గోడౌన్లను పాశంమైలారంలో ఏర్పాటు చేసి నిల్వ చేసేవాడు.
అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకుని వారి ద్వారా పిడిఎస్ రైస్‌ను సేకరించేవారు. బియ్యం గోడౌన్‌లో నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి గుజరాత్‌కు చెందిన శర్మకు ఎక్కువ ధరకు విక్రయించే వారు. జక్కపల్లి శంర్ గతంలో కూడా పిడిఎస్ రైస్‌ను విక్రయిస్తుండగా సంఘారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బియ్యం అక్రమ రవాణ గురించి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో తుకారాంగేట్ పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. విలేకరుల సమావేశంలో ఎసిపి సుధీర్, ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వర్ రావు, డిఐ ఆంజనేయులు,తదితరులు పట్టుకున్నారు.