Monday, December 23, 2024

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగానే మే నెలలోనే పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదో తరగతి ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఓఎస్‌ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు అన్నీ కూడా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. కాగా, 15వ తేదీ రోజు ఆదివారం కావడంతో మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండనుంది. అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ ఆరు పేపర్లకే షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లు ఉండేవి. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పేపర్ల సంఖ్యను 11 నుంచి 6కు తగ్గించింది. దీంతో సబ్జెక్ట్‌కు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది.

TS SSC Exam Schedule 2022 released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News