బెంగుళూరు: ఈసారి ఐపిఎల్ 2022 మెగా వేలంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. శనివారం బెంగుళూరులో జరుగుతున్న ఐపిఎల్ వేలంలో అయ్యర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.12.25కోట్లకు దక్కించుకుంది. ఈ మెగా వేలంలో 590మంది ఆటగాళ్ల కోసం 10ప్రాంచైజీలు పోటిపడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వేలంలో ఇప్పటివరకు శ్రేయస్ అయ్యర్ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా అత్యధిక ధర పలికాడు. రబడాను రూ.9.25 కోట్లకు, శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక, అశ్విన్‌ను రాజస్థాన్ రూ.5కోట్లకు సొంతం చేసుకుంది.ప్యాట్ కమ్మిన్స్ ను రూ.7.25కోట్లకు కోల్‌కతా దక్కించుకోగా.. ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ రూ.8 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మెగా వేలం కొనసాగుతోంది. కాగా, ఐపిఎల్ 15వ సీజన్ లో కొత్తగా మరో రెండు జట్లు పాల్గొననున్నాయి. మార్చి చివరి వారం ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.
Another star @ShreyasIyer15 added to the #GalaxyOfKnights 🌟#KKR #AmiKKR #IPLAuction #TATAIPLAuction #ShreyasIyer pic.twitter.com/2GWupx1rvP
— KolkataKnightRiders (@KKRiders) February 12, 2022
IPL Auction 2022: Shreyas Iyer sold to KKR for Rs 12.25