Monday, December 23, 2024

మోడీ పాలనలో దేశం సర్వనాశనం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Country destroy in Modi ruling

యాదాద్రి భువనగిరి: మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై సిఎం కెసిఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యాదాద్రి పర్యటించిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. మోడీకి పిచ్చి ముదిరిపోయి పిచ్చి పిచ్చి పాలసీలు తెస్తున్నారని మండిపడ్డారు. ఏడాది పాటు రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి – పిచ్చి ఎక్కి రైతులతో పెట్టుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. మోడీని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 8 ఏళ్ల బిజెపి పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని,  ఏంది చూసేది తోకమట్టనా? కెసిఆర్ సంగతి చూస్తా అంటే బయపడే వాడు ఎవడు లేడన్నారు.  ఈ దేశం ఎవని అయ్యా సొత్తు కాదని, నరేంద్ర మోడీ సిగ్గుపడాలన్నారు.  హిజాబ్ అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు. మతపిచ్చి లేపి కర్ణాటక లో ఆడపడుచులను ఆగంచేస్తున్నారని,  బిజెపి వాళ్ళు కుక్కల లెక్క అరవడం మానాలని సూచించారు.  పొద్దున లేస్తే కర్ఫ్యూలు- ఘర్షణలు అవసరమా? అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News