- Advertisement -
ఛండీగఢ్ : ప్రధాని మోడీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14,16,17 తేదీల్లో అనేక ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మోడీ పర్యటన, ప్రచారాలను బహిష్కరించాలని రైతులు యోచిస్తున్నారు. ప్రధాని మోడీ ఈనెల 14న జలంధర్‌లో తొలిర్యాలీలో పాల్గొంటారు. 16 న పఠాన్‌కోట్, 17 న అబోహర్‌లో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ హెలికాప్టర్ లేదావిమానాల్లో ప్రయాణించాలని, రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటే నిరసన సెగలు ఆయనకు తప్పవని కాంగ్రెస్ ఎంపీ రవ్‌నీత్ సింగ్ బిట్టూ స్పష్టం చేశారు . సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏడాది పాటు రోడ్లపై గడిపిన విషయాన్ని పంజాబీలు మరువలేదని అన్నారు
- Advertisement -