- Advertisement -
హైదరాబాద్: దంపతుల మధ్య గొడవ జిహెచ్ఎంసి ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అంజయ్య అనే వ్యక్తి జిహెచ్‌ఎంసి చెత్త తరలింపు విభాగంలో వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అల్వాల్‌లోని జోన్నబండలో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. సకాలంలో అప్పులు చెల్లించక పోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం అంజయ్య తమ్ముడు వదిన లక్ష్మమ్మతో ఘర్షణకు దిగాడు. తానే ఈ గొడవకు కారణమని అంజయ్యతో లక్ష్మమ్మ గొడవ పెట్టుకుంది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో అంజయ్య ఇంట్లో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -