- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్ మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని హుగెల్లి గ్రామ శివారులో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. హుగెల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ ఆదివారం రాత్రి 11గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వెతుకుతుండగా.. గ్రామ శివారులో ఉన్న మామిడితోటలో సదరు బాలిక మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్ట కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, సదరు బాలికను కొందరు దుండగలు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Minor Girl killed in Zahirabad
- Advertisement -