Monday, January 20, 2025

దేశ భద్రత పటిష్టతకు కేంద్రంతో కలిసి పనిచేస్తా: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Will work with Cenre over Security of India: Kejriwal 

న్యూఢిల్లీ: దేశ భద్రత విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజీ పడబోదని, పంజాబ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే భద్రతను పటిష్టపర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. పంజాబ్‌లో రాజకీయ మార్పుతోపాటు సామాన్యుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అవినీతిమయమైన సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి పంజాబ్‌ను కాపాడటానికి ఈ శాసనసభ ఎన్నికలు సువర్ణావకాశమని తెలిపారు. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం పై ప్రశ్నకు సమాధానంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధాని భద్రత విసయంలో ఎటువంటి రాజకీయాలు ఉండకూడదన్నారు. అయితే ఈ అంశంపై ఇరు పక్షాలు రాజకీయం చేశాయని వ్యాఖ్యానించారు.

Will work with Cenre over Security of India: Kejriwal 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News