Thursday, April 10, 2025

ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా…

- Advertisement -
- Advertisement -

Srileela First look poster release from Dhamaka

 

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ‘ధమాకా’ చిత్రం రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తుండగా శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. వారిద్దరి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News