Friday, November 22, 2024

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సమాప్తి

- Advertisement -
- Advertisement -

Ramanuja millennium celebrations come to an end

చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో యజ్ఞానికి మహా పూర్ణాహుతి

హాజరైన
కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డి,
రాజేంద్రనగర్
ఎంఎల్‌ఎ
ప్రకాశ్ గౌడ్

మహాపూర్ణాహుతితో ముగిసిన వేడుకలు

మన తెలంగాణ/హైదరాబాద్: ముచ్చింతల్ శ్రీరామనగరం లో రామానుజ సహస్రాబ్ధి సమారోహ ఉత్సవం ఘనంగా ము గిసింది. వేడుకల్లో చివరిరోజైన సోమవారం స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహణతో పాటూ, శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ మహాపూర్ణాహుతీ కార్యక్రమాలు ప్రముఖ ఘట్టాలుగా నిలిచాయి. చినజీయర్ స్వామి తమ శిష్యగణంతో పాటూ, వందలమంది ఋత్వికులూ, వేల సం ఖ్యలో భక్తులూ హాజరైన పక్షంలో పవిత్రమైన ఆ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కార్యక్రమాలలో భాగంగా, సోమవారం ఉదయం యాగశాలలోని సహస్ర హోమకుండాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం జరిపించి, తదనంతరం చినజీయర్ స్వామి ఆథ్వర్యంలో య జ్ఞానికి మహా పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యా గంలో వినియోగించిన 1035 పాలికులను తీసుకుని, సమతామూర్తి సువర్ణ ప్రతిమ వద్దకు భక్తజనంతో యాత్రాగా బయలుదేరి వైభవంగా సువర్ణ సమతా మూర్తికి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు.

తొలి ఆరాధనతో పాటూ, పారాగ్లైడర్లతో పుష్పాక్షతల అభిషేకాన్నీ, పంచామృతాలతో, తదనంతరం ఉదకంతో అభిషేకాన్ని, అరుదైన పుష్పాలతో అర్చనా నిర్వహించారు. ప్రతిష్ఠాపనా కార్యక్రమం తరువాత భద్రవేది మొదటి అంతస్థులో ఉన్న ఋత్వికులూ, భక్తులూ కలిసి పవిత్రమైన శ్రీమన్నారాయణ తిరుమంత్రాన్ని ఆలపిస్తూ ఆనందతాండవం చేశారు. చినజీయర్ స్వామి ఆయన బృందంతో కలిసి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 దివ్య దేశపు ఆలయా ల్లో దేవతామూర్తులకు కళ్యాణోత్సవాలు నిర్వహించారు. పదమూడో రోజైన సోమవారం నుంచి సాధారణ భక్తు జనులందరికీ నిత్యం శ్రీరామానుజుల ఆలయ దర్శనానికి అనుమతించారు. ఎనిమిదో వింతగా కీర్తి గాంచిన ఈ పుణ్య క్షేత్రంలో సమతా మూర్తికీ, దివ్యదేశాలలో పెరుమాళ్ళకీ నిత్యం విశేష పూజలు నిర్వహిస్తారు.

హాజరైన రాజకీయ ప్రముఖులు

యాగశాలలో జరిగిన శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం మహాపూర్ణాహుతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో సహా ముచ్చింతల్ కు చేరుకున్న ఆయనకి, తమ శిష్యగణంతో కలిసి చినజీయర్ స్వామీ, మైహోం గ్రూప్ అథినేత రామేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. సమతామూర్తి కేంద్రంలో స్వర్ణరామానుజాచార్యులకి జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థ ప్రసాధాలందుకున్నారు కిషన్ రెడ్డి. మరో పక్క తెలంగాణా రాష్ట్రానికే కొత్త మణిహారంగా ఎనిమిదో వింతైన సమతా మూర్తి కేంద్రం మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సహస్రాబ్ధి ఉత్సవాల చివరి అంకం సంధర్భంగా సోమవారం వచ్చిన ఆయన, 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్నీ, 108 దివ్య దేశాలనీ దర్శనం చేసుకునీ, యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రకా ష్ గౌడ్ ప్రసంగిస్తూ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకా కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రముఖం గా యాదాద్రి దేవాలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం చేసినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News