- Advertisement -
సంగారెడ్డి: బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హంగెల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక గ్రామ శివారులోని మామిడి తోటలో శవంగా కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
- Advertisement -