Monday, January 20, 2025

అన్ని దారులూ మేడారానికే…

- Advertisement -
- Advertisement -

ములుగు: మేడారం జాతర… ఒకప్పుడు ఆదివాసీలు, జానపదులు, గ్రామీణులు పాల్గొనే జాతర. ఈ జాతరకు రెండు దశాబ్దాల కెరటం వరకూ పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లలో వచ్చేవారు. కాల క్రమేణా, జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో మొదటి సారిగా హెలికాఫ్టర్ ను ప్రవేశ పెట్టారు. 2014 నుండి వరంగల్ మామునూరు, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయాల నుండి పర్యాటకులను తీసుక రావడానికి ప్రత్యేకంగా హేలీ సర్వీసులు ప్రారంభ మయ్యాయి. ఇలా, మేడారం జాతర ఎడ్ల బండి నుండి హెలికాఫ్టర్ ల ద్వారా వచ్చే వారి సంఖ్య అధికమైనది.
1990 సంవత్సరం వరకూ నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్దగా ఈ జాతరకు వచ్చే వారు కాదు. దీనికి కారణం, ఇరుకైన రోడ్లు, గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్, అంతంతగానే ఉండే పారిశుధ్య కార్యక్రమాలు తదితర కారణాలను చెప్పుకోవచ్చు. 1994 జాతర వరకూ భారీ సంఖ్యలో గ్రామీణులు, గిరిజనులు ఎడ్ల బండ్లలోనే వచ్చేవారు. జాతర ప్రారంభానికి ఒకటి, రెండు రోజుల ముందుగానే ఎడ్ల బండ్లలో మేడారం వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకొని సారలమ్మ, సమ్మక్క లు గద్దెలపై ప్రతిష్టాపన అయినా అనంతరం మూడోరోజు పూర్తి స్థాయి దర్శనం చేసుకున్న అనంతరమే తిరిగి వెళ్తారు.
1994లో జరిగిన మేడారం జాతరకు 25వేలకు పైగా ఎడ్ల బండ్లు వచ్చాయని అంచనా వేశారు. అయితే, 1996 నుండి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నానఘట్టాలు నిర్మించడం, క్రమక్రమేణా మొత్తం జంపన్న వాగు పొడవునా నిర్మించడంతో ఎడ్ల బండ్ల సంఖ్య 90 శాతం తగ్గింది. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుండి మేడారం చేరుకోవాలనే స్థానిక గిరిజనుల విశ్వాసం. అయితే, స్నానఘట్టాలు నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం, కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లు జాతరకు వస్తున్నాయి.
కాగా, స్థానిక గిరిజనుల డిమాండ్ మేరకు జంపన్నవాగుపై 2002లో బ్రిడ్జిని నిర్మించారు. దీనితోపాటు వాగు పొడుగునా స్నాన ఘట్టాల ను దాదాపుగా ఊరట్టం క్రాస్ రోడ్డు వరకు నిర్మించారు. దీనితో, ఎడ్ల బండ్ల ద్వారా మేడారం వచ్చే ఆదివాసీ గిరిజనులు, గ్రామీణులు ఎడ్ల బండ్ల పై రావడం తగ్గించారు. ఇలా, మేడారం జాతర ప్రస్థానం ఎడ్ల బండి నుండి హెలికాఫ్టర్ వరకు మారింది.
ప్రస్తుత జాతరకు కాజీపేట నుండి ఒక్కొక్కరికీ రూ. 20 వేలు
బెంగుళూరుకు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ హేలీ కాప్టర్ తో పాటు రాజస్థాన్ కు చెందిన ప్రైజెలైన్ ఆధ్వర్యంలో విస్సా ఫౌండేషన్ వారి సహకారంతో మేడారంజాతరలో అడ్వెంచర్ హాట్ ఎయిర్ బెలూన్, ప్యారా సెయిలింగ్ ప్రతేకంగా ఏర్పాటు చేస్తున్నది. హేలీ రైడ్ కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ గ్రౌండ్ నుండి మేడారం వరకు ప్రయాణానికి గాను ఒక్కొక్కరికి రూ.19,999గా ఛార్జ్ చేస్తారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ.3700 ఛార్జ్ చేస్తారు.

Huge Devotees Goes to Medaram Jatara

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News