- Advertisement -
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది భారత్ ఆధ్వర్యంలో జరగనున్న జి 20 సదస్సుకు సెక్రటేరియట్ ఏర్పాటుకు ఇతర సన్నాహాలు ్ల చేయడానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలియచేసింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు ఈ సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం సమావేశమై జి 20 సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయడానికి విధానపరమైన నిర్ణయాలు అమలు చేయడానికి, సారధ్యం వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియచేసింది.
- Advertisement -