Monday, December 23, 2024

ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం

- Advertisement -
- Advertisement -

Aadavallu meeku joharlu release on 25th

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ “ఈ సినిమా నేను అనుకున్నంత హ్యాపీగా రావడానికి కారణమైన సినిమాలోని ఆడవాళ్లందరికీ ధన్యవాదాలు. శర్వా ఈ సినిమా ఫ్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా పూర్తి సహకారం అందించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది”అని అన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధిక, కుష్బూ లాంటి యాక్టర్స్‌తో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నాను. రష్మికతో కలిసి నటించడం చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని తెలిపారు. రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో రష్మిక మందన్న, కుష్బూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News