Friday, December 20, 2024

నిన్న దినసరి కూలీ… నేడు మోడల్ క్రేజ్

- Advertisement -
- Advertisement -

Mammikka became a model overnight

 

కొజికోడ్ : నిన్నటి దాకా రోజుకు వంద రూపాయల కూలీకి పనిచేసిన వ్యక్తి నేడు అమాంతంగా క్రేజీ మోడల్ అయి లక్షలు సంపాదిస్తున్నాడంటే ఆశ్చర్యమే. కేరళ లోని కొజికోడ్ జిల్లాలో కూలిపని చేస్తూ రోజులు గడిపే 60 ఏళ్ల మామ్మిక్కా రాత్రికి రాత్రే మోడల్ అయిపోయి, అనేక కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. అతని జీవితం ఒక్కసారి మేలిమలుపు తిరగడానికి ఫోటోగ్రాఫర్ షరీక్ వాయాలిల్ కారణం. మామ్మిక్కాను ఫోటో తీసి దాన్ని తన సోషల్ మీడియాలో సరదాగా షరీక్ పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అచ్చం నటుడు వినాయకన్‌లా ఉన్నాడంటూ కామెంట్లు చేశారు. దీంతో మామ్మిక్కాను మోడల్ చేయాలనుకుని తన వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్‌గా వేషం మార్చేశాడు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. కొన్ని కంపెనీలు తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ ఆహ్వానించాయి. ఇప్పుడు మోడల్‌గా లక్షలు వచ్చి పడుతున్నాయి. ఒక్క రోజులో మామ్మిక్కా జీవితం మారిపోయినా సరే తనకు అన్నంపెట్టిన కూలీపని మాత్రం విడిచిపెట్టబోనని మామ్మిక్కా చెబుతుండడం మరీ క్రేజ్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News