Monday, December 23, 2024

నటుడు అలీకి రాజ్యసభ సీటు!

- Advertisement -
- Advertisement -

Rajya Sabha seat for actor Ali!

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, వైసిపి నే త అలీ మంగళవారం ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఇటీవల టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం జ గన్‌ను కలిసిన పలువురు సినీ ప్రముఖుల్లో అలీ ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. భేటీ ముగిసిన తర్వాత అలీతో ప్రత్యేకంగా మరో వారం రోజుల్లో మనం మరోసారి కలుద్దామని సి ఎం ప్రత్యేకంగా చెప్పారు. అనుకున్నట్లే మళ్లీ ఇప్పుడు జగన్‌ను కలవడంతో అలీకి రాజ్యసభ సీటు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒక స్థానం మైనార్టీ అభ్యర్థికి కేటాయిస్తార నే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిఎం అలీవైపు మొ గ్గు చూపుతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలలో ఆలీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి పార్టీకి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. కాగా, రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News