Monday, December 23, 2024

నారాయణ ఖేడ్ దశదిశ మారుతోంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Narayana Khed is changing direction

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం హయాంలో నారాయణ ఖేడ్ దశదిశ మారుతుందని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు.  గతంలో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న నారాయణ ఖేడ్ ..టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.  నారాయణ ఖేడ్ లో 70 ఏళ్లలో పరిష్కారం కానీ సమస్యలు సిఎం కెసిఆర్ చొరవతో 7 ఏళ్లలో పరిష్కారం చూపామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తీసుకువచ్చి సింగూర్ ప్రాజెక్ట్ కు అనుసంధానం చేసి సింగూర్ బాక్ వాటర్ నుంచి బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వార సాగు నీరు ఇవ్వబోతున్నామన్నారు. రూ. 1074 కోట్లతో బసవేశ్వర ప్రాజెక్టు కు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.  సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు లను సిఎం కెసిఆర్ చేతుల మీదుగా 21 తేదీన శంకుస్థాపన చేయబోతున్నామన్నారు.  నారాయణ ఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, కొండలతో నిరుపయోగంగా ఉండేదని, నేడు బసవేశ్వర ప్రాజెక్టు తో నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి లక్ష 37 వేల ఎకరాలకు సాగునీటి ఇస్తామన్నారు.  బసవేశ్వర ప్రాజెక్టు నిర్మాణం తర్వాత నారాయణ ఖేడ్ ప్రాంతం కాశ్మీర్ లోయ లాగా మారుతుందన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు గోదావరి నీళ్లు తో సస్యశ్యామలం కాబోతున్నాయని హరీష్ రావు ప్రశంసించారు. సిఎం కెసిఆర్ చొరవతో నారాయణ ఖేడ్ ప్రాంతం బంగారు భవిష్యత్తు మారిందన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని 167000 ఎకరాల సాగునీరు ఇవ్వబోతున్నామని ప్రశంసించారు. 21న జరిగే సిఎం సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి ఘన స్వాగతం పలకలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News