Monday, December 23, 2024

నగరం గులాబీమయం

- Advertisement -
- Advertisement -

CM KCR Birthday celebrations in hyderabad

సిఎం కెసిఆర్ జన్మదినం పురస్కరించుకుని భారీ కటౌట్లు
పలు కూడళ్లను గులాబీ తోరణాలతో ఆలకరించిన నాయకులు
మెట్రో పిల్లర్లకు సిఎంకు శుబాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యేల ప్లెక్సీలు
రక్త శిభిరం, పేదలకు అన్నదానం, బట్టలు, పండ్లు పంపిణీ చేసిన కార్యకర్తలు
పథకాల అమలుతో దేశంలో రాష్ట్రం మొదటిస్దానంలో నిలిపిన ఘనత కెసిఆర్ దక్కిందని నేతల ప్రశంసలు

హైదరాబాద్: గ్రేటర్ నగరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకల సందర్భంగా గులాబీమయంగా మారింది. ఎటు చూసిన ముఖ్యమంత్రి పోటోలతో గులాబీ ప్లెక్సీలు, తోరణాలు మెరిసిపోతున్నాయి. స్దానిక నేతలు పలు కూడళ్లను భారీ కటౌట్లు ,పార్టీ జెండాలతో ఆలంకరణ చేసి పండగ వాతావరణం కనిపించేలా చేశారు. మెట్రో పిల్లర్లకు స్దానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లెక్సీలు ఏర్పాటు చేసి అధినేతకు జన్మదిన శుబాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు నేతలు యువజన విభాగం నాయకులతో కలిసి రక్తదాన శిభిరం ఏర్పాటు చేసి టిఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. బుధవారం బేగంపేట, రాంగోపాల్ పేట డివిజన్‌లో టిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంధ విద్యార్ధుల పాఠశాలలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ భారీ కేకును కట్ చేశారు.

ఉస్మానియా యూనివర్శిటీలో టిఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ నిర్వహించిన రక్త శిభిరాన్ని శాసనసభ్యులు గాదరి కిషోర్ ప్రారంభించారు. మారేడుపల్లిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తిరుమలగిరి ఆర్యవైశ్య భవన్‌లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ నేతృత్వంలో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. అదే విధంగా సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ, అంబేద్కర్ నగరంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సాయన్న సందర్శించారు. స్వరాష్ట్రాన్ని ప్రజలందరి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ అహర్నిశలు తపిస్తున్నారని, రాష్ట్రం అనేక రంగాల్లో పురోగాభివృద్ది సాధిస్తుందని, అనేక సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్దానంలో ముఖ్యమంత్రి నిలిపారని నాయకులు గుర్తు చేశారు. అదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో అన్నదానం కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే దానం నాగేందర్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

చెవిటి మూగ విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ పిల్లలకు బట్టలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు సంగీతయాదవ్ పండ్లు, బట్టలు అందజేశారు. అనంతరం దానం నాగేందర్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడు రోజుల పాటు పండగలా జరుపుతామని, తెలంగాణ భవన్‌లో రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నామని, 17వ తేదీన హరితహారం, సిఎం పేరిట యజ్ఞాలు, పూజలు చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ స్దానిక కార్పొరేటర్లతో కలిసి పలు డివిజన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పేద ప్రజల, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్నముఖ్యమంత్రి కెసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. అంబర్‌పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్దానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ దవఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజలు మరో పదేళ్ల పాటు టిఆర్‌ఎస్ పాలన కోరుకుంటున్నారని స్దానిక నాయకులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News