- Advertisement -
ముంబై : దేశ వాణిజ్యనగరమైన ముంబై, నవీముంబై మధ్య వాటర్ టాక్సీ సర్వీస్‌లను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌థాక్రే గురువారం ప్రారంభించారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ జలమార్గంలో రవాణాసదుపాయం ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. దీంతో వీటిమధ్య దూరం, ప్రయాణసమయం బాగా తగ్గుతాయి. ఈ వాటర్ టాక్సీ సేవల కోసం బేలాపూర్ జెట్టీ ప్రాజెక్టును 2019 జనవరిలో ప్రారంభించారు. 2021 సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తయింది. సాగరమాల ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.8.37 కోట్లు ఖర్చు చేశారు.
- Advertisement -