Wednesday, April 9, 2025

సెమీస్‌లో సానియా జోడీ

- Advertisement -
- Advertisement -

Sania-Hradecka pair enters semifinals

దుబాయి: భారత స్టార్ సానియా మీర్జా జోడీ దుబాయి టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూసియా హ్రాడెకాతో కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన సానియా సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ 75, 63 తేడాతో అలెగ్జాండ్రా క్రూనిక్ (సెర్బియా)షుకో అయోమా జంటను ఓడించింది. ఆరంభ సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇరు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. దీంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో ఆఖరు వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సానియా జోడీ విజయం సాధించింది. ఇక రెండో సెట్‌లో సానియా జంట అలవోక విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News