- Advertisement -
తిరుపతి: తెలంగాణ సిఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దంపతులు శుక్రవారం ఉదయం తిరుపతిలోని కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. గురువారం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ 68వ జన్మదినం సందర్భంగా ఆమె పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
- Advertisement -