- Advertisement -
న్యూఢిల్లీ: కొత్తగా మరో 25,920 కరోనా కేసులు నమోదు కావడంతో దేశంలో శుక్రవారం ఉదయం వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,27,80,236కు పెరిగింది. కాగా.. 43 రోజుల తర్వాత మొదటిసారి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా మరో 492 మంది మృత్యువాత పడడంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 5,10,905కు పెరిగింది. వరుసగా గడచిన 12 రోజులుగా రోజు వారీ కరోనా కేసుల సంఖ్య లక్ష లోపలే నమోదవుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,92,092 ఉన్నాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్యలో ఇది 0.68 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.12 శాతానికి మెరుగుపడినట్లు కేంద్రం తెలిపింది. గడచిన 24 గంటల్లో 40,826 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్రం పేర్కొంది.
- Advertisement -