తీవ్ర వ్యాధిని కలిగించగలదు!
ప్రయోగశాల అధ్యయనంలో వెల్లడి
టోక్యో: ఒమిక్రాన్ కరోనావైరస్ రూపాంతరమైన బిఏ.2 అనే సబ్‌వేరియంట్ చాలా వేగవంతంగా వ్యాపించడమేకాక, తీవ్ర వ్యాధిని కలిగించగలదని ప్రయోగశాల అధ్యయనం సూచించింది. ‘ఎట్‌టుబీ పీర్’ కనుగొన్న విషయాలను సమీక్షించింది. ఇటీవల ప్రీప్రింట్ రిపోజిటరీ ‘బయో ఆర్ 14’ లో పోస్ట్ చేసింది. పాత కరోనావైరస్ వేరియంట్స్ మాదిరిగానే బిఏ.2 సబ్‌వేరియంట్ తీవ్ర జబ్బుకు గురిచేయగలదని పేర్కొంది. అంతగా తీవ్రతరం కాని బిఏ.1 సబ్‌వేరియంట్ కన్నా బిఏ.2 సబ్‌వేరియంట్ వేగంగా విస్తరించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. “ఏది ఏమైనప్పటికీ వాటి తీవ్రతల మధ్య అంత తేడా ఏమి లేదు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవిడ్19 సాంకేతిక అధికారిణి మరియా వాన్ కెర్‌ఖోవా ఓ వీడియోలో తెలిపారు. ఒమిక్రాన్ వ్యాధిని 2021 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో కనుగొన్నారు. బిఏ.1 సబ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించిన సంగతి తెలిసిందే.