- Advertisement -
న్యూఢిల్లీ: వచ్చే వారం ఉక్రెయిన్‌కు మూడు విమానాలు నడుపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆ విమానాలు భారత్ నుంచి ఉక్రెయిన్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫిబ్రవరి 22,24,26 తేదీల్లో నడువనున్నాయి. ఉక్రెయిన్‌పై దాడిచేసే ఆలోచనేది లేదని రష్యా చెబుతున్నప్పటికీ, నాటో దేశాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ సరిహద్దులకు రష్యా 1 లక్ష ట్రూప్‌లను పంపింది. అంతేకాక నల్ల సముద్రంలోకి యుద్ధ నౌకలు పంపి కవాత్తులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని భారతీయుల సాయం కోసం, సమాచారం అందించడం కోసం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను బుధవారం ఏర్పాటుచేసింది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటలపాటు హెల్ప్‌లైన్ పనిచేస్తోంది.
- Advertisement -