న్యూఢిల్లీ: భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మను బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మెట్ లో రోహిత్ శర్మకు బిసిసిఐ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. టెస్టు కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవడంతో తాజాగా అన్నీ ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ పేరును ఖరారు చేసింది. దీంతో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. లంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు బిసిసిఐ రోహిత్ సారథ్యంలోని జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు పుజారా, రహానెలను పక్కన బెట్టారు. బుమ్రాకు టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ ఇచ్చారు.
భారత జట్టు: రోహిత్(కెప్టెన్), బుమ్రా(వైస్ కెప్టెన్), కోహ్లీ, మయాంక్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ బరత్, ప్రియాంక్ పాంచల్, అశ్విన్, షమీ జడేజా, జయంత్ కుల్దీప్, సిరాజ్, ఉమేష్, సౌరభ్ కుమార్.
BCCI Announces Rohit name as Test Captain