- Advertisement -
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జాతీయ బ్యూరో చీఫ్ రవీష్ తివారీ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణ వార్తను సీనియర్ జర్నలిస్టు వికాస్ భదౌరియా ట్విటర్‌లో శనివారం తెలియచేశారు. తన ఆప్త మిత్రుడు, మంచి మనిషి రవీష్ తివారీ శుక్రవారం రాత్రి కన్నుమూశారని, ఆయన అంత్యక్రియలు శనివారం సాయంత్రం గుర్గావ్‌లోని సెక్టార్ 30లో జరుగుతాయని వికాస్ ట్వీట్ చేశారు. కాగా&రవీష్ తివారీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. రవీష్ తివారీని అందర్‌దృష్టిగత సంస్కారవంతమైన వ్యక్తిగా ప్రధాని అభివర్ణించారు.
- Advertisement -