- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తనతోపాటు తనభార్యకు, ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ సోకిందని, సహచర అమెరికన్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటించారు. శుక్రవారం వరుస ట్వీట్లలో ఆయన మొదట తన నాలుగేళ్ల కుమార్తెకు గత వారం కరోనా పాజిటివ్ కనిపించిందని, ఇప్పుడు తన ఐదేళ్ల కుమారుడికి, భార్య ఎలైస్‌కు కరోనా పాజిటివ్ సోకిందని వివరించారు. తనకు తనభార్య ఎలైస్‌కు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఎలైస్‌కు తలనొప్పి, అలసట ఉన్నాయని, తనకు ఒళ్లంతా నొప్పులు, గొంతునొప్పి, చలి ఉన్నాయని చెప్పారు. జాగ్రత్తలు తీసుకున్నప్పుడే రిస్కు తగ్గుతుందని, వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను ఆయన వివరించారు.
- Advertisement -