Saturday, April 12, 2025

యూత్ నుంచి మంచి స్పందన

- Advertisement -
- Advertisement -

Virgin story movie

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా ‘వర్జిన్ స్టోరి’. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ “వర్జిన్ స్టోరి చిత్రంతో ఒక కొత్త ప్రయత్నం చేశామని అభినందిస్తున్నారు. టీనేజ్‌లో ఉన్న వాళ్లకు మా సినిమా కంటెంట్ బాగా అర్థమవుతుంది”అని అన్నారు. దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ “క్లీన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చేశాం. యూత్ నుంచి స్పందన బాగుంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News