Monday, December 23, 2024

మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రేతో కెసిఆర్ భేటీ..

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు సిఎంలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను సిఎం కెసిఆర్ కలువనున్నారు. సిఎం కెసిఆర్ వెంట ఎంపిలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

CM KCR Meets Uddhav Thackeray in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News