Monday, January 20, 2025

విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Man arrested for selling marijuana to students

 

హైదరాబాద్ : విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నేరెడ్‌మెట్, ఆర్‌కె పురంలో బెంగాల్‌కు చెందిన వ్యక్తి విపుల్ సర్కార్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నాడు. విద్యార్థులకు టార్గెట్‌గా చేసుకుని గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్‌ఓటి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం నేరెడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News