Monday, December 23, 2024

31 మంది భారతీయ మత్సకారులను అరెస్టు చేసిన పాక్ అధికారులు

- Advertisement -
- Advertisement -

Pakistan arrests 31 Indian fishermen

ఇస్లామాబాద్: తమ సముద్ర జలాల్లో చేపలను పడుతున్నందుకు 31 మంది భారతీయ మత్సకారులను పాకిస్తాన్ నావికాదళం అధికారులు అరెస్టు చేశారు. వారి ఐదు పడవలను కూడా జప్తు చేశారు. గస్తీ తిరుగుతుండగా పాకిస్థాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్(ఇఇజెడ్)లో ప్రవేశించిన ఆ పడవలను శుక్రవారం పట్టుకున్నట్లు పాకిస్థాన్ మేరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పిఎంఎస్‌ఏ) తెలిపింది. ఇదిలావుండగా పాకిస్థాన్ చట్టం, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒప్పందం మేరకు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకుగాను ఆ పడవలను కరాచీకి తరలించారు. సముద్ర జలాల సరిహద్దులను ఉల్లంఘించి చేపలు పట్టేవారిని అటు పాకిస్థాన్, ఇటు భారత అధికారులు తరచూ అరెస్టు చేస్తున్నారు. విదేశీ జలాల్లో అక్రమంగా చేపలు పడుతూ ఇలా అరెస్టయిన వారు ఆయా దేశాల కారాగారాల్లో మగ్గుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News