Saturday, November 2, 2024

బిసిలకు రూ.10వేల కోట్లకు కేటాయించాలి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి రాష్ట్ర బడ్జెట్‌లో బిసిలకు పది వేల కోట్లకు కేటాయించడానికి కృషి చేస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శాసనసభలో త్వరలో ప్రవేశపెట్టే 2022 రాష్ట్ర బడ్జెట్‌లో బిసి సంక్షేమానికి పది వేల కోట్ల కేటాయించాలని మంత్రిని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. సోమవారం మంత్రిని కలిసి ఆయన చర్చలు జరిపారు. బడ్జెట్లో బిసి కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. పెండింగ్‌లో ఉన్న వేలాది దరఖాస్తుదారులకు వెంటనే సబ్సిడీ రుణాలు అందజేయాలని కోరారు. ఎంబిసి కార్పొరేషన్‌కు రూ.2వేల కోట్లు కేటాయించాలి. 12 బిసి కులాల ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తిలో రూ.2వేల కోట్లు కేటాయించాలని కృష్ణయ్య కోరారు. బిసిల డిమాండ్లను మంత్రికి ఆయన వివరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిసి కార్పొరేషన్లకు, బిసి కుల ఫెడరేషన్లకు ఈ దఫా బడ్జెట్ కేటాయించి సబ్సిడీ రుణాలు ఇస్తామన్నారు. హాస్టళ్లు, గురుకులాలకు అన్ని సౌకర్యాలు ఒకే విధంగా ఇస్తామని బిసి కాలేజి హాస్టళ్లకు పాకెట్ మనీ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ చర్చలలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జిల్లపల్లి అంజి, ఎం.పృథ్వీగౌడ్, సి.రాజేందర్ ముదిరాజ్, చరణ్‌ యాదవ్, లక్ష్మణ్‌యాదవ్, అనంతయ్య పాల్గొన్నారు.

R Krishnaiah meets Gangula Kamalaker

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News