మనతెలంగాణ/హైదరాబాద్: మల్లన్న సాగర్ జలాశయం వద్ద ప్రారంభోత్సవ పనులు పూర్తి కావచ్చాయి.రాష్ట్ర ఆర్ధిక ,వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్ రావు సోమవారం ముఖ్యమంత్రి కెసిర్ పాల్గొన్న నారాయణఖేడ్ సభను ముంగించుకుని నేరుగా అక్కడినుంచి మల్లన్న సాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ నెల 23న సిఎం కెసిఆర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. సిఎం చేత ప్రారంభించనున్న శిలాఫలకం, సభాస్థలి, పంప్‌హౌస్ ,నీటి విడుదల వ్యవస్థ, తదితర ప్రాంతాలను క్షున్నంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. మంత్రి హరీష్ రావు వెంట ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్ ,శ్రీనివాసరెడ్డి, పోలీస్ కమీషనర్ స్వేత, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరేరామ్ తదితర అధికారుల పాల్గొన్నారు.
మల్లన్న సాగర్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -