ఏర్పాట్లను పరిశీలించిన
మంత్రి
రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి
రేపు జాతికి అంకితం చేయనున్న సిఎం కెసిఆర్
ఈ సీజన్లో 17టిఎంసిల గోదావరి జలాలు నిల్వ
2023 జూన్‌నాటికి 50టిఎంసిలకు ప్రణాళిక
మనతెలంగాణ/హైదరాబాద్: కరువు నేలపైకి కాళేశ్వర జలాలు ఉరకలెత్తబోతున్నాయి. నెర్రెలు బారి న నేలతల్లి గుండెలపై సిరులు కురిపించేందుకు మల్లన్న సాగర్ తెలంగాణ రాష్ట్ర జల ఖజానాగా మారబోతోంది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్బాగంగా కొమరవెళ్లి మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 23న మల్లన్న సాగర్ జలాశయంలోకి అధికారికంగా నీటివిడుదలను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని మల్లన్నసాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు ఈ జలాశయానికి అనుబంధంగా పం ప్‌హౌస్ నిర్మించారు. ఈ పంపుహౌస్ వద్ద సీఎం మీట నొక్కి గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. నీటిపారుదల రంగం చరిత్రలోనే సమతల ప్రాం తంలో 50టిఎంసిల నీటినిలువ సామర్ధంతో కూ డిన మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించిన కెసిఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే జలాశయపు నిర్మాణ పనులతోపాటు ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి.
పంట పొలాలకు నీరందించే డిస్ట్రిబ్యూటరి కాలువల పనులు చకచకా జరుగుతున్నా యి. అరుబయలు ప్రాంతం లో సుమారు 17వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ జలాశయం నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇం దుకోసం రూ.7400 కోట్లు ఖర్చు చేసింది.జలాశయం పనులను 2018లో ప్రారంభించి నిర్ణీత గడువుకంటే ఎంతో ముండుగా కేవలం రెండేళ్లవ్యవధిలోనే పనులు పూర్తి చేశారు. 50టిఎంసిల నీటి నిలువ సామర్ధం ఉన్న ఈ జలాశయం భద్రతా ప్రామాణాల దృష్టా తొలి ఏడాది ట్రయల్ రన్‌గా 10.50టిఎంసీల నీటిని నింపారు. రాష్ట్రంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 6.50టిఎంసీల నీటిని జలాశయంలోకి నింపే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నాడు శ్రీకా రం చుట్టనున్నారు. దీంతో ఈ జలాశయంలో నీటి నిలువ ఈ సీజన్లో 17టిఎంసిలకు చేరుకోనుం ది. పంటపొలాలకు సాగునీటి అవసరాలతోపాటు , హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు, నగర శివార్లలోని పారిశ్రామిక అవసరాలను తీర్చేందకు గోదావరి జలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 8,33, 000 ఎకరాల ఆయకట్టుతోపాటు ,12నుంచి18 వరకూ ప్యాకేజిల పరిధిలో 2,95,955ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజాంసాగర్ , సింగూరు , మనదుర్గ( ఘన్పూర్) ప్రాజెక్టుల కింద 11,29,755 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట ,మేదక్ , సంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,మేడ్చెల్ , జనగాం , నల్లగొండ జిల్లాలకు గోదావరి జలాలు అందనున్నా యి. అత్యంత భారీ ప్రణాళికతో చేపట్టిన మల్లన్న సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటినిలువ సామర్దం 50టిఎంసీలు కాగా, కట్ట నిర్మాణం ప్లస్ 557.000మీటర్ల స్థాయిలో నిర్మించారు. బండ్లెవెల్ ప్లస్ 562.000మి. కాగా, మినిమమ్ డ్రాడౌన్ లెవల్ ప్లస్532.165 మిటర్లు గా నిర్ణయించారు. రిజర్వాయర్ ఫుల్ లెవెల్ వద్ద నీటి వ్యాప్తి ప్రాం తం 59.00 చదరపు కిలోమీటర్లు ఉండనుంది. జలాశయం పరివాహక ప్రాంతం 75చదరపు కిలోమీటర్లు కాగా , రిజర్వాయర్ కట్ట పొడవు 22.60 కిలోమీటర్లు ఉంది. కట్టకు ఒటి స్లూయీస్‌లు ఏర్పా టు చేశారు. ప్యాకేజి 14, 15 వద్ద గ్రావిటి నీటి ప్రవాహానికి 2.525కి.మి వద్ద కాలువను నిర్మించారు. దీని ద్వారా ఒక టిఎంసి నీటిని విడుదల చేయనున్నారు.
ఒటి స్లూయీస్2లో ప్యాకేజి 13,17 కోసం 2.891కిమి వద్ద సమాంతర కాలువను నిర్మించారు. దీని ద్వారా 0.5 టిఎంసిల నీరు విడుదల కానుంది. ప్యాకేజి 12కోసం 21.35కిలోమీటరు వద్ద ఏర్పాటు చేశారు. దీని నీటి విడుదల సామర్దం 29.218క్యూమెక్స్గా ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. దీని ద్వారా 1,25,000 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఒటి స్లూయీస్ 4 తపస్పల్లికి కి.మి 0.75వద్ద నిర్మిం చారు. దీని ద్వారా 49.745క్యూమెక్స్ నీరు విడుదల కానుంది. ఒటి స్లూయీస్5ను కి.మి 4.800 వద్ద మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేశారు. రంగనాయక సాగర్ జలాశయం నుంచి విడుదలయ్యే నీటిని ప్రధాన కాలువ నుంచి మల్ల న్న సాగర్ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు 8 మె గా పంపులను నిర్మించారు. ఈ పంప్‌హౌస్‌కోసం 47మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించనున్నారు.
ఫలించిన మెగా కృషి:
కెసిఆర్ మానస పుత్రికగా భావించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మెగా కృషి ఫలించింది. నిర్ణీత లక్ష్యాల కంటే ఎంతో ముందుగానే పనులు పూర్తవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకు ఢోకాఉండదు. మల్లన్న సాగర్‌లో ఈ సీజన్‌కు మొత్తం 17టిఎంసీల నీటిని నిల్వ చే యనున్నారు. 2023 జూన్ నాటికి 50టిఎంసీల నీటిని నిలువ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.