Thursday, May 15, 2025

దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది. టైర్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్ డ్రైవర్ పై దాడి చేసి తుపాకీతో బెదిరించి.. డ్రైవర్ తోపాటు కంటైనర్ ను తీసుకెళ్ళిన ముఠా తమ గోదాంలో టైర్లను అన్ లోడు చేసుకుంది. తర్వాత కంటైనర్ తోపాటు డ్రైవర్ ను వదిలేసింది. దీంతో బాదితుడి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు.

Interstate theft gang arrested by Rachakonda Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News