- Advertisement -
చెన్నై: ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద్ చారిత్రక విజయం సాధించిన విజయం తెలిసిందే. తాజాగా మంగళవారం మరో రెండు రౌండ్‌లలో జయకేతనం ఎగుర వేశాడు. పదో రౌండ్‌లో ఆండ్రీ ఎసిపెంకోపై, 12వ రౌండ్‌లో అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లపై విజయం సాధించాడు. అయితే 11వ రౌండ్‌లో ప్రజ్ఞానంద్‌కు ఓటమి ఎదురైంది. ప్రస్తుతం ప్రజ్ఞానంద 15 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు.
- Advertisement -