పండంటి మగబిడ్డ జననం
ఆదర్శంగా నిలిచిన చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి
కెసిఆర్ కిట్ అందజేసిన వైద్యులు
మనతెలంగాణ/ జయశంకర్ భూపాలపల్లి : సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం క లగాలంటే.. అందుకు తాను ఒకడుగు ముందుండాలని భావించారు భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి. ప్రసవం కోసం నేరుగా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన చైర్‌పర్సన్ శ్రీహర్షిణి పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆమె భూపాలపల్లిలోని జి ల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జ న్మనిచ్చారు. కాగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ఉదయం 7.44 గం టలకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్‌తో కాన్పు చేశారు వైద్యులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలపై నమ్మకం పోతున్న సమయంలో, వాటి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా జడ్‌పి చైర్‌పర్సన్ చూ పిన ఆదర్శానికి పలువురు శ్రీహర్షిణిని అభినందిస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి, గైనకాలజిస్టులు కట్టా శ్రీదేవి, లావణ్య, అనస్తీషియా వైద్యుడు శ్రీకాంత్ చికిత్స అందించిన అ నంతరం ఆమెకు కెసిఆర్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన మాట్లాడు తూ.. సర్కారీ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే తాను ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చానని తెలిపారు. ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే భయపడేవారని, సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మంచి వైద్యం అందించడం పట్ల జనం వీటికీ క్యూ కడుతున్నారని ఆమె తెలిపారు. అందరూ సర్కారీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇ దిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు 978 ప్రసవాలు జరిగాయని వైద్యులు తెలిపారు.