Friday, November 1, 2024

రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

The United States imposed sanctions on Russia

వాషింగ్టన్‌: రష్యా చర్యలపై మండిపడుతున్న నాటో దేశాలు ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై అమెరికా అర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. రష్యాపై ఇప్పటికే జర్మనీ, బ్రిటన్‌ ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించిన దేశాల్లో ఐరోపా సమాఖ్య, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలున్నాయి. ఉక్రెయిన్‌నుంచి వేర్పడిన దొనెట్స్, లుహాన్స్ ప్రాంతాలతో అమెరికా ఎటువంటి వ్యాపారాలు చేయకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ప్రాంతాల్లో అమెరికావాసులు ఎలాంటి పెట్టుబడులు పెట్టరు.ఆ ప్రాంతానికి చెందిన సరకులు, ఇతర సేవలను, టెక్నాలజీని ఏ రూపంలోను అమెరికా దిగుమతి చేసుకోకుండా ఈ ఆంక్షలు అడ్డుకోనున్నాయి. కాగా రష్యాపై విధించనున్న ఆంక్షలను మంగళవారం అమెరికా ప్రకటించనుంది.

ఈ విషయాన్ని శ్వేత సౌధం(అధ్యక్ష భవనం) వెల్లడించినట్లు ఆంగ్ల వార్తాసంస్థ బిబిసి తెలిపింది. కాగా అయిదు రష్యా బ్యాంకులపైన, ముగ్గురు హై నెట్‌వర్త్(సంపన్న) వ్యక్తులపైన బ్రిటన్ ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటీష్ ప్రధాని బొరిస్ జాన్సన్ మంగళవారం ప్రకటించారు. ‘క్రెమ్లిన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన వ్యక్తులు, సంస్థలపైన ఆంక్షలు విధించడం కోసం ప్రభుత్వం పార్లమెంటు ఆమోదించిన కొత్త అధికారాలను ఉపయోగించుకుంటుందని జాన్సన్ పార్లమెంటులో చెప్పారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏం జరగనుందో తాము చెప్పలేమని కూడా ఆయన అన్నారు. రొసియా బ్యాంక్, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రొమ్స్‌వ్యాజ్ బ్యాంక్, బ్లాక్ సీ బ్యాంక్‌పై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.అలాగే బ్రిటన్‌లో వ్యాపారవేత్తలు గెన్నడీ టెమ్‌చెంకో,బొరిస్ రోటెన్‌బెర్గ్,ఇగోర్ రోటెన్‌బెర్గ్‌లకు ఏవైనా ఆస్తులుంటే వాటిని కూడా స్తంభింపజేస్తారు. ఇది మొదటి విడత మాత్రమేనని, అమెరికా, ఐరోపా సమాజంతో పాటుగా తదుపరి ఆంక్షలు విధించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని బొరిస్ జాన్సన్ ప్రకటించారు. కాగా ఆంక్షలపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని ఇయు విదేశీ విధానం చీఫ్ జోసెఫ్ బొరెల్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News