న్యూఢిల్లీ: తమిళనాడులో అత్యంత వెనుకబడిన కులమైన(ఎంబిసి) వన్నియార్లకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల అడ్మిషన్లలో 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్లు తమ వాదనలను లిఖితపూర్వకంగా దాఖలు చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా..ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించడానికి సుప్రీంకోర్టు గతంలో నిరాకరించింది. ఇందుకు సంబంధించిన తీర్పులను తాము పరిశీలిస్తున్నామని, దీన్ని వేరే విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. వన్నియార్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కొట్టివేస్తూ గత ఏడాది నవంబర్ 21న మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం, పాట్టాళి మక్కల్ కట్చి, ఇతరులు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.
వన్నియార్ల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -