Friday, November 22, 2024

4 దశల్లో మా కూటమికి 200 సీట్లు ఖాయం: అఖిలేష్ యాదవ్

- Advertisement -
- Advertisement -

We will win 403 Assembly Seats in UP: Akhilesh Yadav

బహ్రాయిచ్(యుపి): ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగు దశల్లో కలిపి సమాజ్‌వాది పార్టీ సారథ్యంలోని కూటమి 200 సీట్లు గెలుచుకోవడం ఖాయమని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బుధవారం ధీమా వ్యక్తం చేశారు. మొత్తం ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమ కూటమికి అఖండ విజయాన్ని అందచేయవలసిందిగా ఇక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో యుపి ఓటర్లకు అఖిలేష్ విజ్ఞప్తి చేశారు. 12వ తరగతి పాసైన తర్వాత ఇంటర్‌లో చేరే విద్యార్థులకు లాప్‌టాప్‌లు అందచేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలో చేసిన వాగ్దానాన్ని అఖిలేష్ ఎద్దేవా చేశారు. 11, 12 తరగతులను ఇంటర్మీడియట్‌గా వ్యవహరిస్తారు. దీన్నే ఇంటర్ అని కూడా అంటారు. ఈ విషయాన్ని అఖిలేష్ ప్రస్తావిస్తూ బిజెపిలో ఉన్న ఒక నాయకుడు 12వ తరగతి పాసై ఇంటర్‌లో చేరే విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తామని అన్నారు. ఇంకానయం&ఇంటర్ తర్వాత 10వ తరగతి చదివే విద్యార్థులకు ఇస్తామని అనలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లఖింపూర్ ఖేరీ సంఘటనను ప్రస్తావిస్తూ ఒక మంత్రి కుమారుడు కారుతో రైతులను తొక్కించి చంపితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాతే అతనిపై పోలీసులు కేసు పెట్టారని అఖిలేష్ అన్నారు. మంత్రి కుమారుడికి కోర్టులో బెయిల్ వచ్చిందని, అయితే ప్రజా కోర్టు నుంచి మాత్రం రాలేదని, ప్రజలు బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కనివ్వబోరని ఆయన జోస్యం చెప్పారు.

We will win 403 Assembly Seats in UP: Akhilesh Yadav

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News