- Advertisement -
ముంబై : మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు బుధవారం స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. అంతకు ముందు ప్రభుత్వ జెజె ఆస్పత్రిలో మధ్యాహ్నం ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. 62 ఏళ్ల మాలిక్ తెల్లని కుర్తాతో స్పెషల్ జడ్జి ఆర్‌ఎన్ రొకడే ముందు సాయంత్రం 4.50 గంటలకు హాజరయ్యారు. ఏవైనా ఫిర్యాదులు చెప్పుకోవలసింది ఉందా ? అని జడ్జి అడగ్గా మాలిక్ తన ఇంటికి ఉదయం ఈడీ అధికారులు వచ్చారని, వారి కార్యాలయానికి తీసుకెళ్లారని సమాధానమిచ్చారు. ఆ కార్యాలయంలో ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయమన్నారని, తరువాత అవి సమన్లుగా పేర్కొన్నారని జడ్జి ముందు మాలిక్ చెప్పారు. అయితే మాలిక్‌ను విచారించడానికి 14 రోజులు రిమాండ్‌ను కోరుతూ కోర్టుకు ఈడీ వినతి చేసింది.
- Advertisement -