Saturday, November 23, 2024

ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Two arrested for selling oxytocin injections
పాలు ఎక్కువ ఇచ్చేందుకు వాడే ఇంజక్షన్లు
హానికరం కావడంతో నిషేధించిన ప్రభుత్వం

హైదరాబాద్: నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మల్కాజ్‌గిరి ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం….కుషాయిగూడ, కాప్రాకు చెందిన బాచు సత్యనారాయణ అయ్యప్ప కుట్టీ ఎనిమల్ దాణ షాపు నిర్వహిస్తున్నాడు. యాప్రాల్‌కు చెందిన టోడుసు రాజు యాదవ్,చాంద్రయణగుట్టకు చెందిన నాసర్ కలిసి పశువులకు ఇచ్చే ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. 2017లో అయ్యప్ప కుట్టీ పేరుతో దాణ షాపు నిర్వహిస్తున్నాడు సత్యనారాయణ అవసరం ఉన్న వారికి దాణ విక్రయిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన సత్యనారాయణ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నాడు. వీటి తయారీ, విక్రయాన్ని ప్రభుత్వం నిషేధించింది. గేదెలు పాలు ఎక్కువ ఇచ్చేందుకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తారు. అయితే వీటి వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో డాక్టర్ల ప్రిక్కిప్షన్ లేనిదే వీటి విక్రయాలు నిషేధించారు.

ఇలాంటి పాలను తాగిన వారికి, గేదెలకు కూడా హానికరం. వాటిని చాంద్రాయణగుట్టకు చెందిన నాసర్ వాటిని సప్లయ్ చేస్తున్నాడు. ఒక బాటిల్‌ను రూ.300 సత్యనారాయణ కొనుగోలు చేస్తున్నాడు, వాటిని తిరిగి రూ.400 నుంచి 500లకు విక్రయిస్తున్నారు. 2012లో రాజు యాదవ్ యాప్రాల్‌లో దాణా షాపులను ప్రారంభించాడు. మార్కెట్‌లో ఆక్సిటోసిన్ ఇంజక్షన్లకు బాగా డిమాండ్ ఉందని తనకు కావాలని సత్యనారాయణను సంప్రదించాడు. దీంతో సత్యనారాయణ వాటిని రాజుకు విక్రయిస్తున్నాడు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్, చంద్రశేఖర్ తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం జవహర్ నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News