Monday, December 23, 2024

మాంగళ్యం తంతునానేనా…

- Advertisement -
- Advertisement -

Aadavallu Meeku Johaarlu movie

హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను మార్చి 4న విడుదల చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి నాలుగవ పాట ‘మాంగళ్యం తంతునానేనా’ విడుదలైంది. ‘మాంగళ్యం తంతునానేనా’ అనే శ్లోకాన్ని ఆధునీకరించిన ఈ పాటలో శర్వానంద్ తన చిరాకు చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాటకు జస్‌ప్రీత్ జాస్ గాత్రం అందించాడు. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News