25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు అమలు
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్
హైదరాబాద్: ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్‌కు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రదర్మన ముగిసేవరకు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.
ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలు ఎస్‌ఏ బజార్, జాంబాగ్ సైడ్ వెళ్లాలి అటు నుంచి నాంపల్లి నుంచి ఎంజె మార్కెట్ మీదుగా అబిడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లించారు.
బషీర్‌బాగ్, కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులు నాంపల్లి, ఎఆర్ పెట్రోల్‌పంపు, బిజెఆర్ స్టాట్యూ మీదుగా అబిడ్స్ వైపు వెళ్లాలి. బేగం బజార్ ఛారిటీ నుంచి మల్లకుంట నుంచి వచ్చే వాహనాలను అలస్కా జంక్షన్ మీదుగా దారుసలాం, ఎక్ మినార్, నాంపల్లి వైపు మళ్లించారు. దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్, అబిడ్స్ నుంచి వచ్చే భారీ వాహనాలు, డిసిఎంలు అలస్కా మీదుగా బేగంబజార్, సిటీ కాలేజీ, నయాపూల్ వెపు మళ్లించారు. మూసాబౌలి లేదా బహదూర్‌పుర నుంచి వచ్చే భారీ వాహనాలు, ఆర్టిసి బస్సులు నాంపల్లి మీదుగా సిటీ కాలేజీ, నయాపూల్,ఎంజే మార్కెట్ వైపు మళ్లించనున్నారు.