- Advertisement -
బోధన్: మెడిసిన్ చదివేందుకు వెళ్లిన నిజామాబాద్ బోధన్‌కు చెందిన విద్యార్థి ముప్పారాజు వినయ్ ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయాడు. అక్కడి స్థానిక మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు అతడి తల్లిదండ్రులు నరేందర్, సంధ్యారాణిలు చెప్పారు. తమ పెద్ద కొడుకు అయిన వినయ్‌ను ఎంబీబీఎస్ కోసం 2019లో ఉక్రెయిన్‌కు పంపినట్లు తల్లిదండ్రులు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వినయ్ తండ్రి నరేందర్ బోధన్ టౌన్‌లో హార్డ్‌వేర్ షాప్‌ను నిర్వహిస్తున్నారు.
- Advertisement -