బోస్టన్: ఉక్రెయిన్‌లోని పార్లమెంటు, ఇతర ప్రభుత్వ, బ్యాంకింగ్ వెబ్‌సైట్లు గురువారం సైబర్ దాడికి గురయ్యాయి. దాడికి పాల్పడిన గుర్తుతెలియని విద్రోహులు కంప్యూటర్‌లలో వినాకర మాల్‌వేర్‌ను కూడా జొప్పించారని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు. ఉక్రెయిన్‌లో గురువారం డేటాను తుడిచేసే కొత్త మాల్‌వేర్‌ను గుర్తించినట్లు ఇఎస్‌ఇటి రీసెర్స్ లాబ్స్ పేర్కొంది. ఉక్రెయిన్‌లోని వందలాది కంపూటర్ మెషిన్లలో మాల్‌వేర్ జొరపడింది. ఎన్ని నెట్‌వర్క్‌లు ప్రభావితమయ్యాయన్నది ఇంకా తెలియరాలేదు. “డేటాను తుడిచేసే విషయంలో మాల్‌వేర్ విజయవంతమైంది, అనేక కంప్యూటర్ మెషిన్లను దెబ్బతీసింది” అని ఇఎస్‌ఇటి రీసెర్చ్ చీఫ్ జీన్‌ఐయాన్ బోతిన్ ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.
ఇఎస్‌ఇటి కనుగొన్న విషయాలపై అభిప్రాయాన్ని కోరినప్పుడు ఉక్రెయిన్ సైబర్ డిఫెన్స్ అధికారి విక్టర్ జోరా “నో కామెంట్స్” అని బదులిచ్చారు. ఇదిలావుండగా మాల్‌వేర్‌ను డిసెంబర్‌లో రూపొందించి ఉంటారని జీన్ ఐయాన్ బోతిన్ అభిప్రాయపడ్డారు. జనవరిలో సర్వర్లను దెబ్బతీసినంతగా ఇప్పుడు తాజా మాల్‌వేర్ దెబ్బతీసిందా అన్నది ఇప్పుడే చెప్పడం తొందరపాటు చర్యే కాగలదని సైమన్ థ్రెట్ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ ఠాకుర్ తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడికి సైబర్ దాడులు రష్యాకు 2014కన్నా ముందు నుంచే కీలకంగా మారాయి. 2007లో ఎస్తోనియా, 2008లో జార్జియా, తర్వాత క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు సైబర్‌దాడులను ఉపయోగించారు.