Saturday, December 21, 2024

ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని తెలియజేస్తూ…

- Advertisement -
- Advertisement -

Karmayogi dharmavyadha charitra movie

 

భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ’. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం అన్ని పాటలు పాడడం విశేషం. జి.జే రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ భాస్కర్, అనుషా,అశోక్ కుమార్, ఆనంద్ భారతి,వి.మురళీధర్ లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ,రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హ్యుమాన్ రైట్స్ ఛైర్మన్ జె.సి. చంద్రయ్య, బి.సి.కార్పొరేషన్ ఛైర్మన్ వకులా భరణం కృష్ణ మెహన్, దైవజ్ఞ శర్మలు ‘కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర ’ ఆడియోను విడుదల చేయగా నిర్మాతలు సాయి వెంకట్, రామసత్య నారాయణ, నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు యస్.వి.యన్.రావు, వెంకటేశ్వర రాజు, నటికర్ రవి, బి.సి. కార్పొరేషన్ సభ్యుడు ఉపేంద్ర, శాంతా కుమారి, బి.నరసింగ్ రావు, నేతికర్ శ్రీనివాస్, అనుషా, శ్రీనివాస్, రాజేష్, భాగ్యలక్ష్మి తదితరులు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జి.జే రాజా మాట్లాడుతూ “త్రేతాయుగంలో జనక పురంలోని మిథిలా నగరంలో శ్రీహరి భక్తుడైన శ్రీ ధర్మ వ్యాధుడు వేటాడి తెచ్చిన మాంసాన్ని విక్రయించి అంధులైన తల్లిదండ్రులను పోషిస్తూ.. వారిని శివపార్వతులుగా పూజిస్తాడు. ఈ ధర్మవ్యాధుడి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ సినిమా తీయడం జరిగింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News