Monday, December 23, 2024

ఉక్రెయిన్‌పై యుద్ధం వద్దు: రష్యా ప్రజలు

- Advertisement -
- Advertisement -

Do not war on Ukraine

 

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో రష్యాలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ప్రజలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాము యుద్ధానిక వ్యతిరేకమంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. ఉక్రెయిన్ ఆక్రమణను విరమించుకోవాలని, వెంటనే సైన్యం తిరిగి రావాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. దేశ వ్యాప్తంగా 53 పట్టణాల్లో 1700 మందిపైగా నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ప్రజలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్కోలో 900 మంది, పీటర్స్‌బర్గ్‌లో 400 మంది ఆందోళనకారులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News